చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
జగదీప్ ధన్ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధన్ఖర్ సభా కార్యకలాపాలు బాగానే నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఎన్నికయ్యారు.
నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు.
దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈమెయిల్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే, ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు.
Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.