దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు.. పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు.. ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ సహా మరికొందరితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు.. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అమిత్‌షాతో విడిగా కూడా ప్రత్యేక చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి.. గంటన్నర పాటు అమిత్ షా - చంద్రబాబు సమావేశం సాగింది..
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. సాయంత్రం హస్తినకు చేరుకున్నారు మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్.. ఇక, సాయంత్రం 7.30 గంటల తర్వాత ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకే ఢిల్లీకి వచ్చారు లోకేష్..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఢిల్లీ లలిత్ హోటల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం జరిగింది.
గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు.. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. రేపు ప్రధాని మోడీతో నారా లోకేష్ సమావేశం అవుతున్నారు..
దేశంలో మరో కొత్త సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.