Delhi Floods: డేంజర్‌లో యమునా నది.. మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు
- డేంజర్‌లో యమునా నది
- మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు
- ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్‌లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత నీటి మట్టం పెరిగితే కార్యక్రమాలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Off The Record : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ లలో కొత్త టెన్షన్!
Also Read
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ప్రస్తుతం నది ఒడ్డున ఉన్న నివాసాలన్నీ మునిగిపోయాయి. అలాగే వాణిజ్య ప్రాంతాలు కూడా నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మయూర్ విహార్ – ఫేజ్ 1 సమీపంలో ఏర్పాటు చేసిన కొన్ని సహాయ శిబిరాలు కూడా మునిగిపోయాయి. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరడం ఇది మూడోసారి. గతంలో 1978, 2023లో రెండు సార్లు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించింది. 2023లో నగరం తీవ్రమైన వరదలకు గురైనంది. అప్పట్లో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లకు చేరింది. ఇక 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. తాజాగా 2025లో అంతే స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఇది కూడా చదవండి: Jio Anniversary celebration: 9 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. యూజర్ల కోసం బంపరాఫర్లు.. ఫ్రీ అన్ లిమిటెడ్ 5G డేటా!
యమునా బజార్, గీతా కాలనీ, మజ్ను కా తిలా, కాశ్మీరీ గేట్, గర్హి మండు, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో వాణిజ్య, నివాస భవనాలు రెండూ కలిసి ఉంటాయి. ఇప్పటివరకు 14,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటీఓ, మయూర్ విహార్, గీతా కాలనీల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఇక వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి వరద ప్రభావిత ప్రాంతాలు, యమునా నది సమీపంలోని సహాయ శిబిరాల్లో పురుగుమందులను పిచికారీ చేయాలని పౌర సంస్థ ప్రజారోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.
#WATCH | Delhi | Some of the relief camps set up near Mayur Vihar-Phase 1 are flooded as the Yamuna River continues to swell due to continuous rainfall pic.twitter.com/4tYpOnjp6D
— ANI (@ANI) September 4, 2025
#WATCH | Vehicles submerged, buildings flooded on Bela Road in Delhi's Civil Lines as water from the overflowing Yamuna river entered the area. pic.twitter.com/S3js3aFEXK
— ANI (@ANI) September 4, 2025
#WATCH | Delhi: Parts of the Kashmere Gate area flooded as water level of the River Yamuna rises.
Drone visuals from the area shot at 7:10 am today. pic.twitter.com/QhtbK6DiYO
— ANI (@ANI) September 4, 2025
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall.
Those living in low-lying areas near the Yamuna River were relocated to safer sites, anticipating the flood emergency. pic.twitter.com/bA9TlnYD5k
— ANI (@ANI) September 4, 2025
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!