గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. దీంతో ఐడీఎఫ్ భీకరదాడులు చేస్తోంది. తాజా దాడులు మీడియా సంస్థలు లక్ష్యంగా జరుగుతున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య ఆస్పత్రిపై దాడి ఘటనలో ముగ్గురు జర్నలిస్టులు చనిపోగా.. ఈ మధ్య కాలంలో జరిగిన దాడిలో మరో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను ఆయా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
సోమవారం గాజాలో ఐదుగురు జర్నలిస్టుల మృతిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికరం.. విచారకరం అని పేర్కొంది. గాజాలోని ఒక ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టుల హత్యను భారతదేశం ఖండిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే మృతులకు సంతాపం తెెలిపారు.
ఇది కూడా చదవండి: UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
జర్నలిస్టులంతా రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా, మిడిల్ ఈస్ట్ ఐ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో అనుబంధంగా ఉన్నారు. సోమవారం జరిగిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులతో సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతంలో జరిగిన ప్రత్యేక సమ్మెలో స్థానిక వార్తాపత్రికకు చెందిన ఆరవ జర్నలిస్ట్ కూడా మరణించాడు. మీడియా సంస్థలు తమ సహోద్యోగుల మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశాయి. సోమవారం నాసర్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో నలుగురు ఆరోగ్య కార్యకర్తలు కూడా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఈ సంఘటనను విషాదకరమైన ప్రమాదంగా అభివర్ణించారు. సైనిక అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 200 మంది జర్నలిస్టులు చంపబడ్డారని మీడియా వాచ్‌డాగ్‌లను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ తెలిపింది.
Our response to media queries regarding loss of lives of journalists in Khan Younis, Gaza
🔗 https://t.co/he8LS9Kw35 pic.twitter.com/HT3s7gAkMw
— Randhir Jaiswal (@MEAIndia) August 27, 2025