ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నినసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోడీ ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ పినాకి మిశ్రా మే 30న వివాహం జరిగింది. జర్మనీలోని ఒక ప్రైవేటు వేడుకలో ఇద్దరూ ఒక్కటయ్యారు.
Congress Mahadharna in Delhi Today: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి.. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మహాధర్నా నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. బీసీ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్…
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఇండియా కూటమి నేతలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఆగస్టు 7న విపక్ష సభ్యులకు డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.