దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీ అంతటా కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచే చీకట్లు అలుముకున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి.
కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు.
చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు.
దేశంలో మహిళల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట కట్టుకున్నవాళ్లను కాటికి పంపేస్తున్నారు. కొందరు ప్రియుడితో సుఖం కోసం భాగస్వాములను చంపేస్తుంటే.. ఇంకొందరు ఆయా కారణాల చేత అంతమొందిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగు చూసింది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
జగదీప్ ధన్ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధన్ఖర్ సభా కార్యకలాపాలు బాగానే నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఎన్నికయ్యారు.
నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు.