National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట్ కార్ బాంబు దాడి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ధౌజ్, నుహ్, దాని పరిసర ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలు శుక్రవారం రాత్రి సమన్వయ దాడులు నిర్వహించాయి.
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు…
ఢిల్లీ బ్లాస్ట్పై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తాజాగా బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు…
Regime-change operation: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు దారి తీసింది. ఈ అల్లర్ల కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, ఇతరుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ సిద్ధం చేశారు. ఈ హింసాకాండ ప్రణాళికాబద్ధంగా జరిగిందని, పాలనను మార్చేందుకు ‘‘రెజిమ్ ఛేంజ్ ఆపరేషన్’’లో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
దేశ రాజధానిలోకి పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూడాచారిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని పోలీసులు చేధించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లోలో పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు కలిగిన నెట్ వర్క్ ను పోలీసులు కనుగొన్నారు. పాకిస్తాన్…
టెక్నాలజీ పెరిగే కొద్దీ.. మనిషి క్రూరత్వం కూడా పెరుగుతోంది. సమాజం ఏమనుకుంటుందోనన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎవరి కోసమంటారా? దేశ రాజధాని ఢిల్లీలో తనపై యాసిడ్ దాడి జరిగిందంటూ ఒక డిగ్రీ విద్యార్థిని హల్చల్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.