నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కరోనా నివారణ చర్యల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడంపై ట్విట్టర్‌లో స్పందించిన రాహుల్.. ఆ పోస్టర్ల కాపీలను షేర్ చేస్తూ. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.. ఇక, మోడీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?…