Delhi riots case: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిల్..
- ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిల్..
- సోదరి వివాహం కోసం 2 వారాల బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్ధి, ఢిల్లీ ట్రయల్ కోర్టు జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. కోర్టు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రూ. 20,000 వ్యక్తిగత బాండ్‌పై, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
ఉమర్ మధ్యంతర బెయిల్ కోరుతూ కర్కర్‌డూమా కోర్టును ఆశ్రయించారు. తన సోదరి వివాహం డిసెంబర్ 27 న జరగాల్సి ఉంది, ఆ వివాహానికి తన అవసరం తప్పనిసరి అని ఆయన కోర్టుకు తెలిపాడు. గతేడాది డిసెంబర్‌లో కుటుంబంలో ఒక వివాహానికి కోర్టు ఖలీద్‌కు 7 రోజలు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు, 2022లో తన సోదరి వివాహ వేడుకకు హాజరుకావడానికి అతడికి ఒక వారం మధ్యంతర బెయిల్ లభించింది.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
Read Also: JINN : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు “జిన్”
ఖలీద్ తాత్కాలిక బెయిల్‌పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. ‘‘తన సోదరి వివాహానికి హాజరుకావడానికి ఉమర్ ఖలీద్‌కు ఐదు ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా ఉన్న గుర్మీత్ సింగ్ వంటి దోషులకు పదే పదే పెరోల్‌లు లభిస్తున్నాయి. ఈ అసమానత మన న్యాయ వ్యవస్థలో ఇబ్బందికరమైన అస్థిరత, పక్షపాతాన్ని బహిర్గతం చేస్తుంది’’ అని అన్నారు.
2020 ఢిల్లీ మత అల్లర్ల వెనక కుట్ర ఉందని ఆరోపిస్తూ, ఈ కేసులో ఉమర్ ఖలీద్‌ను సెప్టెంబర్ 2020 నుంచి కస్టడీలో ఉంచారు. తాజాగా బెయిల్ ఇస్తూ, కోర్టు కొన్ని షరతులు విధించింది. ఖలీద్ ఏ సాక్షి లేదా కేసులో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని సంప్రదించొద్దని, తన మొబైల్ నెంబర్‌ను విచారణ అధికారికి అందించాలని, బెయిల్ సమయంలో ఈ నెంబర్‌కు యాక్టీవ్‌గా ఉండాలని సూచించింది. బెయిల్ ముగిసిన తర్వాత డిసెంబర్ 29 సాయంత్రం జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
మరోవైపు, ఢిల్లీ అల్లర్ల కుట్రలో UAPA కేసులు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతరుల బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వీరి బెయిల్‌ను ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అల్లర్లు ఆకస్మికంగా జరిగినవి కావని, ముందస్తు ప్రణాళికతో, భారత సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!