ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతన్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా దారుణమైన బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అతడు నిరాశే మిగులుస్తున్నాడు. ఇదే ఆట తీరును అతడు కొనసాగిస్తే భారత జట్టులో కాదు.. కదా.. ముంబై దేశవాళీ జట్టులో కూడా చోటు దక్కడం కష్టమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరువాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.
ఐపీఎల్ 2023లో మరో కీలక పోరుకు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.