Royal Challengers Bangalore Scored 174 Runs Against Delhi Capitals: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేదు. అంతంత మాత్రంగానే రాణించారు. డు ప్లెసిస్ (22), లామ్రోర్ (26), మ్యాక్స్‌వెల్ (24) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో షాబాజ్ (12 బంతుల్లో 20) తనకు వీలైనంత వరకు నెట్టుకొచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 22 బంతుల్లో ఒక ఫోర్ సహకారంతో కేవలం 15 పరుగులే చేశాడు. హోమ్ గ్రౌండ్‌లో ప్రతీసారి విరుచుకుపడే ఆర్సీబీ జట్టు.. ఈసారి మాత్రం సోసోగానే రాణించింది.
ఓపెనర్లుగా మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట శుభారంభమే అందించారు. 4.4 ఓవర్లలోనే వీళ్లిద్దరు తొలి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఎప్పట్లాగే వీళ్లిద్దరు చెలరేగి ఆడటంతో.. ఈసారి కూడా ఆర్సీబీ భారీ స్కోరు చేస్తుందని అనుకున్నారు. కానీ.. డు ప్లెసిస్ ఔటయ్యాక ఆ అంచనాలు బోల్తా పడ్డాయి. క్రీజులో ఉన్నంతవరకు కోహ్లీ తన జట్టుని ముందుకు నడిపించాడు. కానీ.. అతడు ఔటయ్యాక ఆర్సీబీ జోరు తగ్గింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. ఏదో.. తమవంతు సహకారం అందించారే తప్ప, మెరుగైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక చివర్లో అనూజ్ బంతులు వృధా చేయడంతో, ఆశించిన స్కోరు రాలేదు. 174 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఢిల్లీ బౌలర్లలో.. నోర్ట్యే ఒక్క వికెట్ కూడా తీయకపోయినా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. మిచెల్, కుల్దీప్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్, లలిత్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. మరి.. ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.
Renuka Chowdhury: బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే.. అక్రమ కేసులు బనాయించడం దారుణం