RR vs DC: గౌహతిలో మెరిసిన రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీకి హ్యాట్రిక్ ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs DC: రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.

Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మొదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు జోస్ బట్లర్(79), యశస్వీ జైస్వాల్(60), అర్ధ శతకాలు బాదడంతో సంజూ సేన భారీ స్కోర్ చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ బౌలింగ్‌తో ఢిల్లీని వణికించాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ఒం (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఓ ఆ తర్వాత ఢిల్లీని 142 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. అశ్విన్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ మూడోసారి ఓటమి పాలై హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో మూడో మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది రెండో గెలుపు.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (60: 31 బంతుల్లో 11X4, 1X6), జోస్ బట్లర్ (79: 51 బంతుల్లో 11X4, 1X6) అర్థశతకాలు బాది భారీ స్కోరును నమోదు చేయడంలో కీలక పాత్ర వహించారు. మొదటి వికెట్‌కే 98 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనర్లు భారీ స్కోరుకి పవర్ ప్లేలోనే బాటలు వేశారు. ఇక ఆఖర్లో సిమ్రాన్ హెట్‌మెయర్ (39 నాటౌట్: 21 బంతుల్లో 1X4, 4X6) భారీ సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ మెరుగైన స్కోరుని అందుకోగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ రెండు, కుల్దీప్ , రోవ్‌మెన్ పొవెల్ చెరో వికెట్ తీశారు.
పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి మొదటి నుంచి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా (0) డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరినీ ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ (14) తేలిపోయినా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (65: 55 బంతుల్లో 7×4) పట్టుదలతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి లలిత్ యాదవ్ (38: 24 బంతుల్లో 5×4) మాత్రమే కాస్త సహకారం అందించాడు. స్లాగ్ ఓవర్ల ముందు అక్షర్ పటేల్ (2), రోవ్‌మెన్ పొవెల్ (2) ఔటైపోవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది. బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోవడంతో వార్నర్ దూకుడు పెంచుతూ టీమ్ స్కోరు 139 వద్ద 8 వికెట్‌గా ఔటైపోయాడు. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 142/9కే పరిమితమై ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!