క్రికెట్ ఆడాలంటే.. ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో ఫిట్‌గా ఉండాలి. మైదానంలో గంటల తరబడి బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్.. ఏది చేయాలన్నా ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం పురుష, మహిళా ప్లేయర్స్ అందరూ ఫిట్‌గా ఉండడమే కాదు.. సిక్స్ ప్యాక్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఓ మహిళా ప్లేయర్ మాత్రం 2022లో రిటైర్మెంట్ ఇచ్చినా, 100 కేజీలకు పైగా బరువు ఉన్నా.. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో మాత్రం దూసుకుపోతోంది. ఆమె ఎవరో…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్ సాధించింది. తన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో నందిని కూడా చేరింది. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కనికా అహుజా,…
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025-26 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన రీతిలో పుంజుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఛేదనకు దిగిన…
క్రికెట్‌లో అసాధ్యం కానిదంటూ ఏమీ లేదని అంటారు. మ్యాచ్‌లో ప్రతి బంతికి పరిస్థితులు మారుతూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ఉత్సాహం పరిమితులను మించిపోయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. ఆకిబ్ నబీ ఫాస్ట్ బౌలర్ అయినా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి…
WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు జెమిమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో…
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో మూడు సార్లు ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను డిసెంబర్ 23న ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మెగ్ లానింగ్ నాయకత్వంలో అస్బుతంగా ఆడిన ఢిల్లీ.. ఈ ఏడాది ప్లేయర్ రిటెన్షన్లలో ఆమెను కొనసాగించకపోవడంతో ఆ అధ్యాయం ముగిసింది. వేలంలో మళ్లీ లానింగ్‌ను దక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లకు ఆమెను కొనుగోలు చేయడంతో ఢిల్లీకి నిరాశ ఎదురైంది. Lion Viral…
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇకపై అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగబోతున్నట్లు సమాచారం. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గ్లోబల్ అలర్ట్.. మరింత కఠినంగా…
WPL 2026 Auction: WPL 2026 మెగా వేలం న్యూఢిల్లీలో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ వేలానికి మరోసారి మల్లికా సాగర్ యాక్షనీర్గా వ్యవహరించారు. ఇక ఈ వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 73 ఖాళీల కోసం పోటీపడగా.. 277 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వేలంలో తెలుగమ్మాయి శ్రీ చరణి జాక్ పాట్ కొట్టిందని భావించవచ్చు. కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి దిగిన ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.
భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో…