కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేకేఆర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు 128 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
ఐపీఎల్-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్ లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్ తో మ్యాచ్ కోసం వార్నర్ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం( ఏప్రిల్ 16 ) ఢిల్లీకి చేరుకుంది.
ఢిల్లీ జట్టు ఓటమి బాధ్యతలను రికీ పాటింగ్, సౌరభ్ గంగూలీ తీసుకోవాలన్నారు.. వరుస ఓటములకు వారిదే బాధ్యత అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు.