IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు. ముందుగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన బెంగళూర్ ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ శుభారంభాన్ని అందించారు. కోహ్లీ అర్థశతకం సాధించగా… డుప్లెసిస్ 22 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లలో మహిపాల్ లామ్రోర్ 26, మాక్స్ వెల్ 24, షబాజ్ అహ్మద్ 20 పరుగులు చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగుల చేసింది. డీసీ బౌలర్లలో మిచెల్ మార్షల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లను పడగొట్టారు. అక్షర్ పటేల్, లతిత్ యాదవ్ తలోవికెట్ తీశారు.
Read Also: Telangana Elections: తెలంగాణకు ఎలక్షన్ ఫీవర్.. ఈసీ స్పెషల్ ఫోకస్
కష్టతరం కానీ 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం మూడు ఓవర్లలోనే ఒకంకె స్కోరుకే 3 కీలక వికెట్లను కోలిపోయింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా మనీష్ పాండే హాఫ్ సెంచరీతో పోరాడారు. మిగతా వారిలో అక్షర్ పటేల్ 21, అన్రిచ్ నోర్జే 23 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్ చేయలేదు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ విజయ్ కుమార్ వైషాక్ 3 కీలక వికెట్లు తీసి ఆదరగొట్టాడు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రూపంలో ముగ్గురిని ఔట్ చేశాడు. సిరాజ్, పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.