ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతన్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మేము గత రెండు మ్యాచ్ ల్లో తొలుత బ్యాటింగ్ చేసాము.. అందుకే సరిగ్గా రాణించలేదు. పిచ్ పొడిగా కనిపిస్తోంది.. బహుశా కొంత మలుపు తీసుకుంటుంది అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ రాత్రి మంచు కూడా ఒక కారణం కావచ్చు.. మేము స్టబ్స్ స్థానంలో రిలే మెరెడిత్‌ని ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇతర మార్పులు ప్రభావం ఆటగాళ్లకు సంబంధించినవి.. అది ఎలా ఉంటుందో చూడాలి.. ఈ మ్యాచ్ కు జోఫ్రా అర్చర్ అందుబాటులో లేడు అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Read Also : RCB : ధోనీ రికార్డును రాత్రికి రాత్రే లేపేసిన ఆర్‌సీబీ
ఒకవేళ టాస్ మేం గెలిచి ఉంటే మేము కూడా అదే పని చేసి ఉండేవాళ్లం అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. మేము ఇప్పటి వరకు వరుసగా మూడు మ్యాచ్ లను ఓడిపోయాం కానుక ఈసారి టీమ్ మొత్తం మనం కష్టపడి పని చేయాలి నిర్ణయించినట్లు వార్నర్ వెల్లడించారు. మా టీమ్ లో చిన్న మార్పులు చేశాం.. ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు.. అతని స్థానంలో యష్ ధుల్‌ని తీసుకున్నట్లు డేవిడ్ వార్నర్ తెలిపాడు.అలాగే రిలీ రోసౌవ్, ముస్తాఫిజుర్ రెహమాన్‌కు కూడా అందుబాటులో ఉన్నారు.. కుర్రాళ్లందరూ ఉల్లాసంగా ఉన్నారు.. మేము పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి.. అలాగే మా హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నామని డేవిడ్ వార్నర్ అన్నాడు.
Read Also : TMC: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి లూయిజిన్హో ఫలేరో..
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (సి), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (w), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్