Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్
- కాంగ్రెస్‌తో అందుకే విడాకులు
- ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దల సభలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే నెలలో కొందరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వీడ్కోలు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పంచ్‌లు వేశారు. ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. కాంగ్రెస్‌తో డేటింగ్ చేసి.. బీజేపీని పెళ్లిని చేసుకున్నారని ఛలోక్తులు విసిరారు. దీంతో ప్రధాని మోడీ సభ సభ్యులంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
తాజాగా ఖర్గే హాస్యాస్పదంపై దేవెగౌడ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్సే తనను బలవంతంగా పెళ్లి చేసుకునేలా చేసిందని.. ఆ బంధం ఊపిరాడకుండా చేయడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మాజీ ప్రధాని కూడా సరదాగా బదులిచ్చారు. 2018లో కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్ మధ్య జరిగిన రాజకీయ పొత్తును గుర్తుచేసుకుంటూ.. 2019లో తాను కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకోలేదని.. పైగా కాంగ్రెస్సే తనను వదిలేసిందన్నారు. ఆ సంబంధం కేవలం దూషణలతో నిండి ఉందని.. అందుకే తాను విడాకులు కోరాల్సి వచ్చిందని తెలిపారు. ఇక మిత్రుడు ఖర్గే సభలో మాట్లాడినప్పుడు తాను సభలో లేనని చెప్పారు. రేపటి ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు బెంగళూరుకు రావాల్సి వచ్చిందని.. అందుకే సభలో లేనన్నారు.
Also Read
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
‘‘2018లో కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్‌ను పంపి.. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన విషయం ఖర్గేకే గుర్తుంటుంది. నేను దీనిని సమర్థించలేదు. ఖర్గేనే ముఖ్యమంత్రిని చేయాలని నేను బహిరంగంగా చెప్పాను. ఆ సమయంలో సిద్దరామయ్య కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఆజాద్… కుమారస్వామి నాయకత్వానికే పట్టుబట్టారు. ‘పెళ్లి’ లాంటివన్నీ అయ్యాక 2019లో వాళ్లు ఏం చేశారు? మమ్మల్ని వదిలేశారు. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారో.. వారిని ఎవరు పంపారో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఫిరాయింపులను ప్రేరేపించిన వ్యక్తిపై కాంగ్రెస్ చర్య తీసుకుని ఉంటే.. ఈ రోజు నా స్నేహితుడు ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరింత మెరుగైన స్థితిలో ఉండేవారు. అసలు విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ కూటమిని వీడలేదు. పైగా వారే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. వారితో విడిపోయి.. మరింత అనువైన భాగస్వామిని వెతుక్కోమని వాళ్లే నన్ను బలవంతం చేశారు.’’ అని దేవెగౌడ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఖర్గే ఏమన్నారంటే..
రాజ్యసభ సభ్యుల వీడ్కోలు ప్రసంగంలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని.. చాలా కాలం సన్నిహితంగా పని చేసినట్లుగా గుర్తుచేశారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ మాతో ఉంటుండగానే అధికార పార్టీతో చేతులు కలిపారన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. మాతో డేటింగ్ చేసి.. చివరికి వారిని పెళ్లిని చేసుకున్నారని పంచ్ వేశారు. ఈ డైలాగ్‌తో ప్రధాని మోడీ సహా సహచర ఎంపీలంతా నవ్వుకున్నారు.
దేవెగౌడ..
దేవెగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం సుమారు 10–11 నెలలు కొనసాగింది. భారతదేశానికి 11వ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటి మద్దతు పొందిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
My dear friend Shri. @kharge made a humorous comment in parliament today on my “love” for @INCIndia and “marriage” with @BJP4India. I was not there in the House when he spoke. Here’s my response both lighthearted and factual on why I was forced to “divorce” the Congress @PMOIndia pic.twitter.com/qPK95FUxip
— H D Devegowda (@H_D_Devegowda) March 18, 2026
#WATCH | Delhi | On Former Prime Minister and Rajya Sabha MP, HD Deve Gowda, Congress National President and LoP, Rajya Sabha, Mallikarjun Kharge says, "…I know Deve Gowda ji for more than 54 years and I worked with him a lot. Later, I don't know what happened…' Wo mohabbat… pic.twitter.com/FTyNLCQIzB
— ANI (@ANI) March 18, 2026
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!