IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్ లు చివరి బంతి వరకు వెళ్లి గెలుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు గెలుపు చూడని ఢిల్లి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Also Read : Jagadish Shettar : బీజేపీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు పార్టీకి మాజీ సీఎం రాజీనామా
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. జట్టు డైరెక్టర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్ గా రికీ పాటింగ్ ఉన్నా.. ఢిల్లీ తలరాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జట్టు ఓటమి బాధ్యతలను రికీ పాటింగ్, సౌరభ్ గంగూలీ తీసుకోవాలన్నారు.. వరుస ఓటములకు వారిదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. గత సీజన్ లో ఢిల్లీ ఫైనల్స్ కు చేరినప్పుడు.. క్రెడిట్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ కు దక్కింది.. అలా గెలుపు క్రెడిట్ అతని ఖాతాలో పడినప్పుడు ఓటమి బాధ్యతలను కూడా తీసుకోవాలని సెహ్వాగ్ కామెంట్ చేశారు.
Also Read : Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..
జట్టు ఓడినా, గెలిచినా కోచ్ లదే ప్రధాన పాత్ర ఉంటుందని.. ప్రస్తుతం ఢిల్లీ వరుస ఓటములకు బాధ్యతను సైతం రికీ పాటింగ్ దేనని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. ఇదేమీ భారత క్రికెట్ జట్టు కాదు.. అక్కడ ఎవరైనా గెలిస్తే తమ గొప్పగా భావిస్తారు.. ఓడిత మాత్రం ఇతరులను నిందిస్తారన్న సెహ్వాగ్.. ఐపీఎల్ లో కోచ్ పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే కాదు అన్నారు. అయితే ఈ సారి మాత్రం ఢిల్లీ టీం గొప్పగా రాణించలేదని.. రాబోయే మ్యాచ్ లోనైనా తిరిగి పుంజుకోవాలని సెహ్వాగ్ వెల్లడించారు.