Mumbai Indians Won Their First Match In IPL 2023 Season Against Delhi Capitals: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. చివరి బంతికి ముంబై రెండు పరుగులు తీయడంతో గెలుపొందింది. మొదట్లో రోహిత్ శర్మ (65), ఇషాన్ కిషన్ (31) అద్భుత ఆరంభాన్ని ఇవ్వడం.. మధ్యలో తిలక్ వర్మ కూడా మెరుపులు మెరిపించడంతో.. ముంబై ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.
Rashmi Gautam: బీచ్ ఒడ్డున థైస్ చూపిస్తూ హాట్ యాంకర్ రచ్చ
తొలుత టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 19.4 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్ (51), అక్షర్ పటేల్ (54) అర్థశతకాలతో రాణించడంతో.. ఢిల్లీ ఆ మేరకు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. మొదట్లో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించింది. పవర్ ప్లేలో రోహిత్, ఇషాన్ ఎడాపెడా వాయించడంతో.. ముంబై స్కోరు పరుగులు పెట్టింది. అయితే.. పవర్ ప్లే ముగిసిన తర్వాత ముంబై నెమ్మదించింది. ఇంతలోనే ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ కాస్త మెరుపులు మెరిపించాడు.
Kim Kardashian: కిమ్ కర్దాషియన్ విలక్షణమైన పాత్ర!
ఓవైపు రోహిత్, మరోవైపు తిలక్ చెలరేగడం చూసి.. త్వరలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. అప్పుడే ముంబైకి ఊహించని ఝలక్ తగిలింది. తిలక్ ఔటైన మరో బంతికి సూర్యకుమార్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే రోహిత్ ఔట్ అవ్వడంతో.. ముంబై మళ్లీ కష్టాల్లో పడినట్టయ్యింది. అప్పుడు మేమున్నామంటూ డేవిడ్, గ్రీన్ ముంబైని ఆదుకున్నారు. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు చేయాల్సి ఉండగా.. వాటిని డిఫెంట్ చేసేందుకు నోర్ట్యే సాయశక్తులా ప్రయత్నించాడు. ఫైనల్‌గా ఒక బంతికి రెండు పరుగులు తీయడంతో.. ముంబై ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించగలిగింది.