ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున నాలుగైదు మ్యాచ్ లలో తను విఫలమయ్యాడు.. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పిచడం తెలివితక్కువతనం అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అన్నాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. అయితే ఈ విజయంతో ముంబయి గెలుచుకున్న ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.