ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్ లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్ తో మ్యాచ్ కోసం వార్నర్ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం( ఏప్రిల్ 16 ) ఢిల్లీకి చేరుకుంది.
Also Read : Care Hospital: రోబోతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
ఢిల్లీ ఎయిల్ పోర్ట్ చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు. కాగా చోరికీ గురైన వస్తువులతో 16 బ్యాట్ లు, బూట్లు, ప్యాడ్ లు, గ్లోవ్ లు ఉన్నాయి. ప్రతీ ఒక్క ప్లేయర్ తమ కిట్ బ్యాగ్ ల నుంచి ఏదో ఒక వస్తువును పొగొట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇది విని మేము షాకయ్యామని పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. మేము దీనిపై ఎయిర్ పోర్ట్ లాజిస్టిక్స్ విభాగానికి ఫిర్యాదు చేశామని ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు.
Also Read : Ramchandra Poudel: తీవ్ర అస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు.. ఢిల్లీకి తరలింపు
