ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా దారుణమైన బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అతడు నిరాశే మిగులుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో 12,7 పరుగులే చేసి నిరాశాపరిచిన పృథ్వీ షా.. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తీరును కనబరిచాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన పృథ్వీ షా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుట్ అయ్యాడు.
Also Read : Bandi sanjay: రాంజీగోండు చరిత్రను వెలుగులోకి తెస్తాం.. టైగర్ నరేంద్ర కు ఘన నివాళి..
దీంతో అతడిపై సర్వాత్ర తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే ఆట తీరును అతడు కొనసాగిస్తే భారత జట్టులో కాదు.. కదా.. ముంబై దేశవాళీ జట్టులో కూడా చోటు దక్కడం కష్టమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే పృథ్వీ షాను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక్కడే సరిగ్గా ఆడలేకపోతున్నాడు.. ఇంకా భారత జట్టులో చోటు కావాలంట అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ అయితే సాయిబాబా చూస్తే కాదు.. మన ప్రదర్శన.. కష్టం కూడా ఉండాలి అని కామెంట్ చేశాడు.
Also Read : Bandi sanjay: రాంజీగోండు చరిత్రను వెలుగులోకి తెస్తాం.. టైగర్ నరేంద్ర కు ఘన నివాళి..
అయితే గతంలో టీమిండియాలో చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా సెలక్షన్ కమిటీ తీరును పరోక్షంగా విమర్శించారు. సాయిబాబా అంతా చూస్తున్నారని ఆశిస్తున్నాను అని పృథ్వీ షా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చాడు. అనంతరం న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైనప్పటకీ.. ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశమే దక్కలేదు… ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ పృథ్వీ షాను నెటిజన్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.