Atishi: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషిని ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండబోతోంది. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిషిని తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తాని బలంగా ఎదుర్కొనేందుకు మరో మహిళా నేత అతిషిని ఆప్ రంగంలోకి దించింది. Read Also: Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ…
Anna Hazare: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి స్వయంగా ఓడిపోయారు. ఈయనే కాకుండా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపొందగా,…
Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని అన్ని అధికారులతో సమావేశం నిర్వహించింది.
Aaditya Thackeray: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడం ఇండియా కూటమిలో ప్రకంపనలకు కారణమైంది. దీనికి తోడు శివసేన ఏక్‌నాథ్ షిండేని, శరద్ పవార్ అవార్డుతో సత్కరించడం కూడా ప్రతిపక్ష కూటమిలో తీవ్ర విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రశ్నిస్తోంది.
Amartya Sen: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోరాడాల్సిందని ప్రముఖ నోబెల్ అవార్డ్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని తన పూర్వీకులు ఇంట్లో ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం లౌకికవాదం మనుగడ సాగించాలంటే, ఐక్యత మాత్రమే కాకుండా, భారతదేశాన్ని బహుత్వానికి అద్భుతమైన ఉదాహరణగా మార్చిన విషయాలపై ఒప్పందం ఉండాలని అన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఐక్యత అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. Read Also: Anji Reddy Chinnamile…
Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.
Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది. దశాబ్ధకాలంగా ఉన్న ఆప్ అధికారానికి తెరిదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా సత్తా చాటలేకపోయింది. 67 స్థానాల్లో దారుణంగా డిపాజిట్ కోల్పోయింది.
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు. Read Also: Asteroid: భూమికి…
Congress: ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొంద లేకపోయింది. 67 చోట్ల ఏకంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందంటే, ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్, గత మూడు పర్యాయాలుగా కేవలం ‘సున్నా’ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఢిల్లీ ఎన్నికల్లో 70 సీట్లకు బీజేపీ 48, ఆప్ 22 చోట్ల గెలుపొందాయి. అయితే,…