కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో 'ఆప్' కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా 'పుష్ప' తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని…
Delhi Nyay Yatra: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ఈరోజు నుంచి రాజ్‌ఘాట్ నుంచి ఢిల్లీ న్యాయ యాత్రను ప్రారంభించనుంది. ఈ నెల రోజుల న్యాయ యాత్రలో మొత్తం 70 అసెంబ్లీలు కవర్ చేయబడతాయి. ఈ సమయంలో యాత్ర దాదాపు 360 కి.మీ దూరం ప్రయాణించనుంది. ఈ యాత్రకు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు…
Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
AAP: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు.