పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా వేదికగా ఎందరో ఆన్లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలైంది.
Delhi Doctor Murder: ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా నర్సుగా పనిచేస్తున్న తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త, ప్లాన్ ప్రకారం మైనర్లతో డాక్టర్ని హత్య చేయించాడు. ఇందులో సంచలన విషయం ఏంటంటే.. నిందితుల్లో ఒకరైన మైనర్కి తన కూతురిని ఇచ్చి వివాహం చేయిస్తానని మహిళా నర్సు భర్త హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన “మూటలో మహిళా శవం” హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసీపీ ఎన్.సిహెచ్ రంగస్వామి మీడియాకు వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కన్నా భాగ్యలక్ష్మి అలియాస్ లక్ష్మి (40) హత్యకు గురైంది. ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్ లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఓ డ్రైనేజ్ పక్కన మూటగట్టి…
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది.