Couple Suicide: విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది నుండి వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు. గతంలో యువతి హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో పని చేసేది. మృతుడు కేటరింగ్ ఓనర్‌గా చేస్తున్నాడు. మూడు నెలల క్రితం నుండి ఈ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో ఇరువురి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.
Read Also: High Tension: నారాయణ కాలేజీ వద్ద పోలీసుల మోహరింపు..
ప్రేమజంట ఆత్మహత్యకి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.. సూసైడ్ చేసుకోడానికి ముందు ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లు సంఘటన స్థలంలో ఇంట్లో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. రూమ్‌లో మద్యం బాటిల్స్ ఉండడం, టీవీ రిమోట్, గాజు గ్లాస్ పగలగొట్టి ఉన్నాయి. ఏడాది నుండి లివింగ్ రిలేషన్ లో ఉండడం సడెన్‌గా సూసైడ్ చేసుకోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇద్దరు ఒకే సారి సూసైడ్ చేసుకున్నారా యువతి సూసైడ్‌కి పాల్పడిన తర్వాత యువకుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.