Delhi: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో భర్త, భార్య, కుమార్తె హత్యకు గురైన సంచలనం ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: CM Revanth Reddy: పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభ.. పాల్గొననున్న సీఎం
Triple murder in Delhi | Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. Their son-fourth member of the family had gone out for a walk. Police are present at the spot. More details awaited: Delhi…
— ANI (@ANI) December 4, 2024
సమాచారం ప్రకారం, దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్య సంచలనం సృష్టించింది. మృతులను భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు అర్జున్ ఉదయం 5 గంటలకు మార్నింగ్ వాక్‌కు వెళ్లాడని, ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలు పడి ఉన్నాయని ప్రాథమిక సమాచారంగా తెలిపారు.
ప్రస్తుతం కుమారుడు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతను ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లానని చెప్పాడు. ఇంట్లో తండ్రి రాజేష్, తల్లి కోమల్, సోదరి కవిత ఉన్నారు. అతను వాకింగ్ నుండి తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో ముగ్గురి రక్తంతో మృతదేహాలు కనిపించాయి. ముగ్గురిని కత్తులతో పొడిచి ఆగంతకులు హత్య చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది.