Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
Read Also: Minister Konda Surekha: రాజన్న కోడెల వివాదంపై స్పందించిన మంత్రి కొరేఖ
శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి, తన తల్లిని చంపేవారని, ఆమె చెవిపోగులు చోరీకి గురయ్యాని చెప్పాడు. అయితే విచారణలో పోలీసులకు చోరీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. ఇంట్లో ఇతర విలువైన వస్తువులు చెక్కుచెదరకుండా ఉన్నాయని అధికారులు తెలిపారు. చివరకు పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా తన తల్లి సులోచనను తానే హత్య చేసినట్లు ఆమె చిన్న కొడుకు సావన్ ఒప్పుకున్నాడు.
సావన్ అన్నయ్య కపిల్(27) పెళ్లి త్వరలో జరగబోతోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న మహిళని సావన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, ఈ విషయంపై సావన్‌ని తల్లి మందలించింది. సదరు మహిళను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఆస్తిలో వాటా ఇవ్వనని హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురైన సావన్, పథకం ప్రకారం తల్లిని హత్య చేశాడు. దోపిడి సమయంలో హత్య జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. సరకుల రవాణా వాహనాన్ని నడిపే సావన్ తన సంపాదన అంతా తల్లికి ఇచ్చే వాడని పోలీసులు తెలిపారు.