Meerpet Murder Case: హైదరాబాద్‌లోని మీర్పేట్లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు చెబుతుంటే.. పోలీసులే షాక్ అవుతున్నారు.
Shocking: కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.
Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు…
‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.…
Crime: రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్యమైంది. అతడితో వచ్చిన మహిళ కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
RG Kar Case : గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. సోమవారం సీల్దా కోర్టు ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది.
DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్‌ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి…
నిజామాబాద్ జిల్లా మోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే, రోడ్ బుచ్చన్నతో దగ్గర లక్ష రూపాయల చిట్టీ వేసింది జంగం విజయ. అయితే, చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేకపోవడంతో అతడిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. పైసల కోసం నా పరువు తీస్తుందేమో అనే కారణంతో బుచ్చన్న తన పాలేరు నగేష్‌తో కలిసి సదరు మహిళను హత్య చేసి పూడ్చి పెట్టారు.
Extramarital Affair: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను కరెంట్ షాక్ తో తమ్ముడు చంపేశాడు. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
Ganja Smuggling: హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి…