Crime News : ఈ నడుమ చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వట్లేదని, అడిగిన వస్తువు కొనివ్వట్లేదని.. ఇలాంటి కారణాలకే చంపేస్తున్నారు. మొన్న కూరలో నల్లిబొక్క వేయలేదనే కారణంతో కూడా చంపిన ఘటన చూశాం. ఇప్పుడు తాజాగా ఓ భర్త చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మటన్ కూర వండలేదనే కారణంతో భార్యను కొట్టి చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సిరోల్ మండలం మంజా తండాకు చెందిన మాలోత్ బాలు, కళావతి(35) దంపతులు.
Read Also : Indians Trapped: పొట్ట కూటి కోసం వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో.. చివరికి ఇలా..!
ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో భార్య మటన్ కూర వండలేదని బాలు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవ పెద్దది అయింది. ఆవేశం తట్టుకోలేక బాలు తన భార్యను దారుణంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఇదే విషయంపై కళావతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో గొడవ పడి కొట్టి చంపేశాడని ఆమె ఆరోపిస్తోంది. పోలీసులు బాలును అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.