Buy Back : సైబరాబాద్ లో బై బ్యాక్ పేరుతో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ బాధితులను నిండా ముంచేశారు. పలు స్కీముల పేరుతో ఆటపాకల వెంకటేశ్, సురేష్ అనే ఇద్దరు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. వి ఓన్ ఇన్‌ఫ్రా గ్రూప్స్ బై బ్యాక్ పేరుతో ఈ వసూళ్లకు పాల్పడ్డారు. పెట్టిన పెట్టుబడికి డబుల్ వడ్డీ వస్తుందంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మి దాదాపు 90 మంది పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే భారీగా వడ్డీ చెల్లిస్తామంటూ చెప్పడంతో వారంతా డబ్బులు పెట్టారు.
Read Also : AP High Court: తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కూకట్ పల్లి కేంద్రంగా రెండు స్కీముల పేరుతో ఈ వ్యవహారం నడిపించారు. సాయికృష్ణ దీనికి కీలక సూత్రధారిగా ఉన్నాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 25 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు ఇప్పించాలంటూ వేడుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వెంకటేశ్, సురేష్ లను అరెస్ట్ చేశారు. సాయికృష్ణ పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో మరింత మంది ఇన్ డైరెక్టుగా పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కూకట్ పల్లిలో ఉన్న నిందితుల ఆఫీస్ ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.