ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Live-in relationship: శ్రద్ధవాకర్ దారుణ హత్య ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో జరిగిన దారుణానికి ఉదాహారణగా మిగిలింది. అయితే, శ్రద్ధా తర్వాత కూడా ఇలా లివ్ ఇన్‌లో ఉంటున్న చాలా మంది మహిళలు తమ సహచరుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఘాజీపూర్ లో కూడా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని దుండగులు బండ రాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Hydra…
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్ దేవదాస్ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు…
Puducherry : పుదుచ్చేరిలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రెడ్డియార్ పాళయం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, 11వ తరగతి విద్యార్థి కత్తితో వచ్చి మరో విద్యార్థిపై దాడి చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్‌లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులను చెప్పింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు తేలింది.
Afzalgunj firing: హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని హస్తగతం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో టూ వీలర్ చోరీ చేసిన దుండగులు.. ఆ వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు గుర్తించారు.