Ganja Smuggling: హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి…
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని…
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు.
Double Murder : సంక్రాంతి పండుగ వేళ నార్సింగి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనతో నార్సింగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం రేగింది. సంక్రాంతి సందర్భంగా పలు చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగురుతుండగా, అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి…
Law student suicide: నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
Couple Suicide: కుటుంబ తగాదాలు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణయ్యాయి. ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతుల ఏడాది వయసు ఉన్న పాప ప్రస్తుతం అనాథగా మారింది. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో జరిగింది. విజయ్ ప్రతాప్ చౌహాన్ (32) , అతని భార్య శివాని (28) మధ్య గొడవ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.