Jalsa Shankar: చోరీలు చేయడంలో అతడి స్టైలే వేరప్ప.. బీఫార్మసీ పూర్తి చేసి 100పైగా చోరీలు
- బీఫార్మసీ పూర్తి చేసి 100పైగా చోరీలు చేసిన జల్సా శంకర్
- చోరీ చేసిన ప్రతిదీ తన డైరీలో రాతపూర్వకం.
- అలాగే చోరీ చేసిన ఇళ్లలో ఏమేమి చోరీ చేశాడనేది పేపర్ పై రాసి పెడుతున్న శంకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jalsa Shankar: జల్సా శంకర్ అలియాస్ చోర్ శంకర్ అలియాస్ మంచి దొంగ.. ఇన్ని పేర్లున్న ఈ శంకర్ ఎవరో తెలుసా? ఇతను ఒక పెద్ద దొంగ. ఇప్పటికి దొంగతనాల్లో సెంచరీ కొట్టాడాంటే నమ్మండి. ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే.. ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తాడో ఆ ఇంటి నుంచి చోరీ చేసుకుని పోయిన వస్తువులు అన్నింటిని ఒక చిట్టా రాసి టేబుల్ మీద పెట్టి మరీ వెళ్ళిపోతాడు. ఏమేమి వస్తువులు తన దొంగలించాడో అనే చిట్టాను అక్కడ రాసి పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. ఇప్పటివరకు వంద చోరీ చేసిన జల్సా శంకర్ అలియాస్ చోర్ శంకర్ ని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Starlink Link India: భారత్‌లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
గతంలో ఒకసారి అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ కొన్ని రోజుల్లోనే బయటికి వచ్చిన జల్సా శంకర్ ఇప్పుడు నారాయణగూడలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ లకు చిక్కాడు. బి ఫార్మసీ పూర్తి చేసిన ఆయన కొన్నాల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు. తాను సంపాదిస్తున్న జీతానికి జల్సాలు చేసే దానికి డబ్బులు సరిపోలేదు. దానితో డబ్బులు పెద్ద మొత్తంలో కావాలని ఆశించాడు. కానీ, ఉద్యోగంతో డబ్బులు రాలేదు. దీంతో దొంగతనాలను చేయడం మొదలుపెట్టాడు. బీఫార్మసీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏకంగా చోరీలు చేయడం ప్రారంభించాడు. చోరీ చేసిన డబ్బులతో జల్సాలు చేస్తాడు.. షికార్లకు వెళ్తాడు. విలాసమంతమైన జీవితాన్ని, ఖరీదైన వస్తువులు కొనడమే కాకుండా కొన్ని సందర్భాల్లో దానధర్మాలు కూడా చేస్తుంటాడు ఈ మంచి దొంగ.
ఇకపోతే, దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు ఈ శంకర్ నాయక్. జల్సాలకు అలవాటు పడి వరుస చోరిలకు పాల్పడుతున్న అతడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఓయూ పీఎస్ పరిధిలో జరిగిన చోరీపై పిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎల్బి నగర్ లో ఉన్న శంకర్ నాయక్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. బీఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు, ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి ఆ బంగారంను కుదువ పెట్టి ఆ డబ్బులతో ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటూ జల్సాలు చేసేవాడు.
Read Also: Tummala Nageswara Rao : సత్తుపల్లి అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది
ఇప్పటికే 100కు పైగా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన, మళ్లీ జైలు నుండి వచ్చిన తర్వాత 4 చోరీలకు పాల్పడ్డాడు. అతని వద్ద నుండి 11 తులాల బంగారం తోపాటు ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ప్రతిదీ తన డైరీలో రాసుకోవడమే కాకుండా చోరీ చేసిన ఇళ్లలో ఏమేమి చోరీ చేశాడనేది కూడా చోరీ చేసిన ఇంట్లో పేపర్ పై రాసి ఇంట్లో పెట్టడం అతని నైజం. చోరీల చిట్టాతో పాటు డైరీలు ఎందుకు రాస్తారని అడిగినప్పుడు.. అతను చెప్పిన నిజాన్ని చూసి అధికారులే అవాక్కయారు.
ఒకసారి ఒక ఇంట్లో శంకర్ దొంగతనం చేశాడు.. ఆ ఇంటి నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు పోయాయని ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు.. కానీ, ఆ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలు మాత్రమే శంకర్ ఎత్తుకొని పోయాడు. కానీ, ఇంటి యజమాని 20 తులాలు చోరీకి గురైందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శంకరును చిత్రహింసలు కు గురి చేయగా.. తాను చోరీ చేసింది రెండు తులాలు బంగారం మాత్రమే తీసుకొనిపోయానని అందుకు సంబంధించిన సాక్షాన్ని చూపెట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు దారిని పైన తిరిగి కేసు పెట్టారు. అప్పటినుంచి తప్పనిసరిగా చోరీలు చేసిన చిట్టాతో పాటు డైరీని మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!