Human Trafficking : మన ఇంటి పక్కనే ఉంటున్న యువతులు ఏం చేస్తారో మనకు తెలియదు.. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ మనతో మాట మంతి కలుపుతారు.. అంతా బాగానే ఉంటుంది.. ఆఫీస్ టైం లో బయటికి వెళ్తారు.. తిరిగి ఇంటికి వస్తారు ..వాళ్ళు చేసే వ్యవహారం ఏంటో తెలియదు చాలామందికి.. ఇటీవల కాలంలో కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా తక్కువ అయిపోయింది.. ఇదే అక్రమార్కులకు ప్రధాన వరంగా మారిపోయింది.. కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగిన హైదరాబాద్లో ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు అంతా కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు.. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ లాంటి దేశాల నుంచి కూడా విపరీతంగా జనాలు వచ్చిపోతుంటారు.. కొందరు పర్యాటకులుగా వచ్చిపోతుంటే కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. మరి కొందరు వ్యాపారాలు చేస్తుంటారు ..కానీ దొంగ దారిన ఇండియాకి వచ్చిన వాళ్లు అంతా కూడా అక్రమ వ్యాపారాలే చేస్తున్నారు.. ఇల్లీగల్ పనులకు పాడ్పడుతున్నారు.. అంతేకాదు పశ్చిమ బెంగాల్ నుంచి ఇండియాలోకి జొరబడి అక్కడి నుంచి తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డు తీసుకొని భారత పౌరులుగా చలామణి అవుతున్నారు.. వీళ్లంతా కూడా ఎక్కువగా యువతులే ఇండియాకి వచ్చేవాళ్ళు ఉన్నారు. బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు, స్టీల్ ఫ్యాక్టరీలు, గృహిణులు మొదలైన వాటిలో మెరుగైన జీతంతో ఉద్యోగాలు ఇస్తామనే తప్పుడు సాకుతో బాధిత బాలికలను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు ..ఇండియాలో బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు, స్టీల్ ఫ్యాక్టరీలు, గృహిణులు మొదలైన వాటిలో మెరుగైన జీతంతో ఉద్యోగాలు ఇస్తామనే తప్పుడు సాకుతో బాధిత బాలికలను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీస్ అధికారులు చెప్తున్నారు.
బంగ్లాదేశ్ నుంచి యువతులను ఆక్రమ రవాణ చేసి వ్యభిచారాలు చేయిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతన్న వారిపై ఈడి అధికారులు కేసులు నమోదు చేశారు..రెండు కేసులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడి అధికారులు చెప్పారు. . తెలంగాణ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా ఈడి అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కోన్నారు. హైదరాబాద్ బంగ్లాదేశ్ జాతీయులు నిర్వహిస్తున్న రెండు వ్యభిచార గృహాలపై చేపట్టిన దాడులలో ఛత్రినాక, షహడ్ షరిఫ్ పోలీస్ స్టేషన్లో లో కేసులు నమోదు నమోదు చేశారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోని అక్రమ సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఏజెంట్ల సహయంతో యువతులను ఆక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్నరు.. తప్పుడు మార్గంలో ఆధార్ కార్డులను తీసుకొని భారత పౌరులుగా చెప్పుకుంటున్నారు.
బ్యూటీ పార్లర్లు, టైలర్ షాపులు, స్టీల్ ఫ్యాక్టరీలు, గృహిణులు మొదలైన వాటిలో మెరుగైన జీతంతో ఉద్యోగాలు ఇస్తామనే తప్పుడు సాకుతో బాధిత బాలికలను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పేర్కోన్నారు.. ఈడి అటాచ్ చేసిన ఆస్తులు పేటిఎం వాలెట్లు, బ్యాంకు ఖాతాలలోని బ్యాలెన్స్ మొత్తాల రూపంలో ఉన్నాయిని తెలిపారు. నిందితులలో ఒకరైన రుహుల్ అమీన్ ధాలీ రియల్ ఎస్టేట్ రూపంలో గుర్తించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ అమ్మాయిలను భారతదేశంలోకి అక్రమ రవాణా చేస్తున్న వారిలో పాల్గొన్న ప్రముఖ ఏజెంట్లలో ఒకరని గుర్తించినట్లు తెలిపారు. గత పది రోజుల నుంచి బంగ్లాదేశ్ ల అక్రమ రవాణా పైన సిటీ పోలీసులు మరొకసారి ఫోకస్ చేశారు ఇందులో భాగంగా ఖైరతాబాద్ చాదర్ఘాట్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ లో మెరుపు దారులు నిర్వహించి 24 మంది మహిళలని పట్టుకోవడం జరిగింది వీళ్లంతా కూడా వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.
High Court: మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్.. భర్త సహించలేడన్న హైకోర్ట్..