Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. 11.50 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో పెద్ద నోట్లు పూర్తిగా రద్దు అయిపోయినాయి ..ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న నోట్లో కనబడుతున్నాయి.. అందులో 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి ..ఎవరి దగ్గర చూసినా చిన్న నోట్ల కంటే 500 రూపాయలు నోట్లు ఎక్కువగా ఉంటాయి.. చిల్లర నోట్లు అసలు కనబడకుండా పోయినాయి.. ఈ 500 నోట్ల చలామణిలో అసలు నోట్లు ఎంత నకిలీ నోట్లు ఎంత అనేది ఎవరికీ తెలియదు ..ఎందుకంటే నకిలీ నోట్లో తయారుచేసి చాలా మంది చేస్తున్న గ్యాంగులు కోకలుగా తయారైనారు. ఈ నకిలీ నోటను కూడా ఇప్పుడు గుజరాత్ నుంచే సరఫరా అవుతున్నట్లు సిటీ పోలీస్ చెప్తున్నారు. ఒక అసలు నోటు కు 10 నకిలీనట్లను ఇస్తున్నారు. అహ్మదాబాద్ గ్యాంగులతో ములాఖత్ అయిన హైదరాబాద్ సిటీలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న గ్యాంగుని ఎల్బీనగర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది.. 11 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని నోట్లు స్వాదీనం చేసుకున్నారు.. ఒరిజినల్ నోట్లకు తీసిపోని విధంగా నకిలీ నోట్లు తయారు చేశార..ఇవి నకిలీ నోట్లు అనేదానికంటే ఇవే ఒరిజినల్ నోట్లు అని చెప్పవచ్చు. అంత ప్లాన్ ప్రకారం నోటు తయారు చేశారని సిటీ పోలీస్ అంటున్నారు. అయితే ఈ గ్యాంగ్ ప్రధాన కేంద్రం అహ్మదాబాద్ లో ఉన్న అక్కడికి వెళ్లి విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. నకిలీ కరెన్సీ రాకెట్ ను ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు.. ఏడుగురు నిందితులను అరెస్టు చేసారు.. ముఠా నుంచి 11.50 లక్షల నకిలీ కరెన్సీ. 4 లక్షల అసలు కరెన్సీ, 7 మొబైల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలోని శబరి హిల్స్ కాలనీలో నివాసముంటున్న చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, నల్గొండ జిల్లా దోమలపల్లి మండలం పారాపల్లిగూడెం గ్రామానికి చెందిన మామిళ్ల జానయ్య, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన బిలకంటి భరత్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన జెల్లా వెంకటేశ్.. రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన డొంకని సత్యనారాయణ, మహబూబ్ నగర్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల వెంకటేశ్, ఏపీలోని విశాఖపట్నం జిల్లా బాపూజీనగర్, కంచర్లపాలెంకు చెందిన కె. శివశంకర్, పరారీలో ఉన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ మొత్తం ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్నారు.
కేసులో ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డి కూకట్‌పల్లి ప్రాంతంలోని నిజాంపేటలో నివసిస్తున్నప్పుడు, అతడి భార్య గుండెపోటుతో మృతి చెందింది. ఈ క్రమంలో ప్రకేష్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ కరెన్సీ చలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతడు ఆన్‌లైన్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి, నకిలీ కరెన్సీ నోట్లను విక్రయించే సురేశ్ అలియాస్ సురేశ్ భాయ్ అనే వ్యక్తిని సంప్రదించాడు. జనవరిలో మాణిక్యరెడ్డి అహ్మదాబాద్‌కు వెళ్లి సురేశ్ కు 1 లక్ష ఒరిజినల్ కరెన్సీ ఇచ్చి 11.50 లక్షల నకిలీ కరెన్సీని కొనుగోలు చేశాడు. అనంతరం నకిలీ కరెన్సీ చలామణి చేయడానికి మాణిక్య రెడ్డి తన ప్రణాళికను జానయ్య, వెంకటేశ్, సత్యనారాయణ, భరత్, జి. వెంకటేశ్ కు వివరించాడు. నకిలీ కరెన్సీ తో పాటు నకిలీ బంగారం బిస్కెట్లు విక్రయించడానికి కుట్ర పన్నారు. జానయ్య నకిలీ కరెన్సీని కొనుగోలు చేసేవారిని మాణిక్యరెడ్డికి పరిచయం చేసేవాడు. ఇతను 1 లక్ష అసలు కరెన్సీని తీసుకొని 4 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేవాడు.
Also Read
- Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
మాణిక్య రెడ్డి, అతడి అనుచరులు అక్కడి నుంచి పరారయ్యేవారు. గుజరాత్ కు చెందిన సురేశ్ ఈ నెల 11న మాణిక్యరెడ్డికి ఫోన్ చేసి విశాఖపట్నంలోని కంచర్లపాలెం నివాసి శివశంకర్‌ను ఫోన్ ద్వారా పరిచయం చేసి నకిలీ కరెన్సీ నోట్లు ఇవ్వాలని సూచించాడు. శివశంకర్ ను హైదరాబాద్ కు రావాలని మాణిక్య రెడ్డి చెప్పాడు. ఈ క్రమంలో ఈనెల 13న శివ శంకర్ 4 లక్షల అసలు కరెన్సీతో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతం చింతలకుంటకు వచ్చాడు. చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ ఎదురుగా మాణిక్యరెడ్డి, అతడి అనుచరులతో వ్యాపారం చేస్తున్నాడు. ముఠా నుంచి నుంచి హోండా సిటీ కారు , 10 నకిలీ బంగారు బిస్కెట్లు, 11.50 లక్షల నకిలీ కరెన్సీ, 4 లక్షల అసలు కరెన్సీ, స్వాధీనం చేసుకున్నారు. అసలైన నోట్లకు దీటుగా వీళ్ళు నక్లీ నోట్లు తయారుచేసి విక్రయిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?