Kerala: కేరళలో దారుణం జరిగింది. పతనంతిట్టలో ఆదివారం సాయంత్రం 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో 19 ఏళ్ల అంబులెన్స్ డ్రైవర్, 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఎర్నాకుళంలోని వడయంపాడి నివాసిగా గుర్తించారు.
MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Veera Raghava Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.…
Kishan Reddy : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని ఆయన కొనియాడారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు.
1 నుంచి 8వ తేదీ వరకు ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలకు పాల్పడి.. ఆ తరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8 రోజులే ఎందుకంటే.. ఆ తరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వీరి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.…
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి…
Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది.…
Battula Prabhakar: చిత్తరు జిల్లాలోని సోమల పరిధిలో గల ఇరికి పెంట పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డిపల్లెకి చెందిన గజ దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిపై కన్న తండ్రి అవేదన వ్యక్తం చేశారు.