Holi 2025: హోలీ వేడుకల్లో గంజాయి విక్రయాలు.. గంజాయి కలిపిన కుల్ఫీ ఐస్ క్రీమ్, స్వీట్స్ విక్రయం
- హోలీ వేడుకల్లో గంజాయి విక్రయాలు
- ఎక్సైజ్ STF దాడులు, పలు అరెస్టులు
- మత్తు పదార్థాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi 2025: హైదరాబాద్ నగరంలోని దూల్‌పేట్‌లో హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో గంజాయితో తయారైన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, స్వీట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందం దూకుడుగా దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో హానికరమైన మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దూల్‌పేట్ ప్రాంతంలోని మల్చిపురా ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్స్, సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మామూలుగా కనిపించే ఈ స్వీట్స్, ఐస్ క్రీమ్‌లు తిన్న వారు మత్తులోకి వెళ్లిపోతుండటంతో ఈ అక్రమ కార్యకలాపంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సమాచారం ఆధారంగా హోలీ రోజు దూల్‌పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో గంజాయితో తయారుచేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ స్వాధీనం చేసుకుంది. మత్తు పదార్థాలను భక్ష్య పదార్థాలలో కలిపి విక్రయిస్తున్న వారికి వ్యాపారం నిర్వహించేందుకు అనుమతులు లేవని, వీరి ముఠాలో మరెంత మంది ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ఈ అక్రమ కార్యకలాపంలో ప్రధాన సూత్రధారి సత్యనారాయణ సింగ్ అని గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు. అతనితో పాటు గంజాయి కలిపిన బాదాం మిల్క్, ఐస్ క్రీమ్, స్వీట్స్ విక్రయించిన నిర్వాహకులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనలతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, యువత హోలీ వేడుకల్లో పాల్గొనడం సహజం. కానీ, వారు తినే కుల్ఫీ, ఐస్ క్రీమ్ వంటి పదార్థాల్లో గంజాయి కలపడం ఆందోళనకరంగా మారింది. మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. హోలీ వేడుకలను ఆసరాగా చేసుకుని మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోలీ సందర్భంగా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
India -Pak: ఉగ్రవాదానికి కేంద్రం ఏదో ప్రపంచానికి తెలుసు.. పాకిస్థాన్‌పై భారత్ ఆగ్రహం..
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!