Karnataka : డబ్బు, మహిళ, భూమి అనే మూడింటి కోసం ప్రతి మనిషి ఏదైనా చేస్తాడని అంటుంటారు. అది కూడా నిజమే. కర్ణాటక నుండి ఈ మూడు విషయాలకు సంబంధిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వణికించాయి. అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ప్రాణాలు బలిగొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలైనా గడువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా…
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా…
SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ…
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు.
Mother Killed Son: ప్రకాశం జిల్లాలోని కంభం తెలుగు వీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవీ ( అలియాస్ సాలమ్మ) హత్య చేయించిందని నిర్థారించారు.
ఆస్తి విషయంలో తండ్రి శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్న కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ ప్రసాద్ రావు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని…
Kerala: కేరళలో దారుణం జరిగింది. పతనంతిట్టలో ఆదివారం సాయంత్రం 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో 19 ఏళ్ల అంబులెన్స్ డ్రైవర్, 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఎర్నాకుళంలోని వడయంపాడి నివాసిగా గుర్తించారు.
MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.