Bengaluru: తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సదరు అమ్మాయి తండ్రి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూర్‌లో జరిగింది. మొత్తం మూడు కార్లను తగులబెట్టడంతో పాటు ఒక బైక్‌ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మూడు కార్లలో రెండు అమ్మాయి తల్లిదండ్రులవి కాగా, బైక్ ఆమె సోదరుడిది. నిందితుడు లక్ష్యంగా చేసుకున్న రెండు కార్ల పక్కన మరో కారు ఉండటంతో అది కూడా తగలబడింది.…
Crime: మహారాష్ట్రలోని భివాండీలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆమెపై అఘాయిత్యం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20వ తేదీ తెల్లవారుజామున ఒక పాఠశాలలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. మహిళపై ఆమె మాజీ ప్రియుడు అపహరించి, అతడి నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో మనీషా (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం సంపత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న మనీషా, ప్రస్తుతం రామంతాపూర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే గత రాత్రి ఆమె అనుమానాస్పదంగా మరణించడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. Read Also: Yadagirigutta: ఘనంగా జరగనున్న బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం.. పాల్గొననున్న సీఎం మనీషా…
Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్లో…
వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది. సరిత వ్యవహారాన్ని…
Nizamabad: నిజామాబాద్‌లో ఓ యువకుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చిన ఘోరం వెలుగుచూసింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఈనెల 15న మిస్సింగ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. దానితో కేసు నమోదు చేసి దర్యాప్తు…
Karnataka: ప్రేమించి, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఓ జంట. అయితే, ఆ వివాహిత మరొకరి మీద మోజుపడి కట్టుకున్నోడికి తీరని అన్యాయం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలు తీసుకున్నాడు. తన స్నేహితుడే భార్యను లేపుకెళ్లాడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని వెల్లడించాడు.
పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది.
గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది. తన భర్త పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్‌పై అతని భార్య అనసూయ ఫిర్యాదు చేసింది. భార్య అనసూయ ఫిర్యాదుతో పాటు డీఐజీ కిరణ్ అక్రమ సంబంధాల ఫోటోలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన భార్యతో ఆరు సంవత్సరాలుగా ఎలాంటి సంబంధం లేదని, పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకున్నామనిడీఐజీ కిరణ్ చెబుతున్నాడు.…
హైదరాబాద్ మధురానగర్‌లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ముందే 'నీ పెళ్లాంని నాకిచ్చేయ్.. బాగా చూసుకుంటాను' అని అన్నాడు. దీంతో.. ప్రియురాలి భర్త, సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది.