తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని అన్ని కోట్లలో కేసులను వాదిస్తుంటాడు.. ఒకటి అపార్ట్మెంట్లో ఉండగా మరొకటి ఇండిపెండెంట్ ఇల్లు ఉంది. ఇటీవల కాలంలో బతుకుతెరువు కోసం దస్తగిరి హైదరాబాద్కు వచ్చాడు..చిన్న చిట్కా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.. ఒకానొక సందర్భంలో దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్ కి పరిచయం అయ్యాడు ..ఈ పరిచయంతో న్యాయవాది చేరదీశాడు ..ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చిన న్యాయవాది ఇజ్రాయిల్ కు సహాయం చేసేవాడు. తన మరొక ఇంటిని ఇజ్రాయిల్ చూసుకునేవాడు.. ఏ చిన్న చితట్కా పని ఉన్నప్పటికీ న్యాయవాది ఇజ్రాయిల్ ఎప్పటికప్పుడు దస్తగిరికే చెప్తుండేవాడు ..గత కొన్ని రోజుల నుంచి దస్తగిరి ఇంటికి రావడం మానేశాడు. అర్జెంటు పని ఉందని రమ్మని చెప్తే మీ ఇంట్లో ఉంటున్న లేడీ తనను ఇబ్బంది పెడుతుందని చెప్పాడు ..అదే సమయంలో దస్తగిరి తనను వేధింపులకు గురి చేస్తున్నానని చెప్పి మహిళ వచ్చి న్యాయవాదికి ఫిర్యాదు చేసింది ..తనను లైంగికంగా వేధింపులకు దస్తగిరి గురి చేస్తున్నారని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయవాదికి మహిళ కి చెప్పడం జరిగింది ..దీంతో దస్తగిరిని మందలిచినప్పటికీ సమస్య తీరిపోలేదు ..ఇక లాభం లేదనుకొని దస్తగిరి పైన పోలీసులకు న్యాయవాది పిర్యాదు చేశాడు. ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
నా పైన కేసులు పెట్టిస్తావా అని చెప్పి న్యాయవాది పైన దస్తగిరి కోపం పెంచుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి దస్తగిరి ఇంటికి వచ్చి రెక్కీ నిర్వహించాడు. ఎప్పుడు ఏ సమయంలో బయటకు వెళ్తున్నాడు వస్తున్నాడు. అనే విషయాన్ని తెలుసుకున్నాడు.. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చిన న్యాయవాదిని వెంబడించి వెంటాడు.. న్యాయవాది పైన కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా చంపి వేశాడు.. విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి న్యాయవాది ని చంపి తిరిగి దస్తగిరి వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ..నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే న్యాయవాది పైన దస్తగిరి కత్తులతో పొడిచాడు .. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న న్యాయవాదిని వెంటనే పోలీసులు స్థానికులు ఆసుపత్రికి తరలించారు.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ న్యాయవాది మృతి చెందాడు.. ఒక మహిళకు సహాయం చేద్దామని వెళ్తే న్యాయవాది చివరికి బలయ్యాడు.
Delhi: జస్టిస్ యశ్వంత్ వర్మపై కొలీజియం కీలక నిర్ణయం.. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ