మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్‌ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు. మాధవి డీఎన్ఏ.. తల్లి, పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సి్క్ అధికారులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసినట్లు తేల్చారు.
READ MORE: Chhaava : భారతదేశ పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్ ?
అసలు కథేంటి?
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఇటీవల ఆమెను హత్య చేశాడు. మాధవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేశాడు. తాజాగా డీఎన్‌ఏ రిపోర్టు రావడంతో పోలీసులకు ఈ కేసుపై క్లారిటీ వచ్చింది.