Lawyer Murder Case: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. అయితే, హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లోంగిపోయాడు. ఇక, మృతుడు నివాసం ఉంటున్న పై ఫ్లాట్ లో మహిళను వేధింపులకు గురి చేస్తున్న ఎలక్ట్రిషియన్ దస్తగిరి.. ఆ వేదింపులు భరించలేక అడ్వకేట్ ఇజ్రాయెల్ ను ఆమె ఆశ్రయించింది.
Read Also: Tripurantakam: 27న ఎంపీపీ ఎన్నిక.. అట్రాసిటీ కేసులో అభ్యర్థి అరెస్ట్..!
ఇక, మహిళతో కలిసి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎలక్ట్రిషియన్ దస్తగిరిపై న్యాయవాది ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశారు. తనపై కంప్లైంట్ చేస్తావా అంటూ కక్ష కట్టిన నిందితుడు కత్తితో దాడి చేస చంపేశాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు అరెస్ట్ చేయగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.