కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూయించారు. ఫొటోను చూసిన యువతి.. రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని గుర్తు పట్టింది. ఏడాది క్రితమే మాహేశ్ భార్య అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేశ్ పాత నేరస్తుడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
READ MORE: Chennai: యూట్యూబర్ ఇంటిపై దుండగుల దాడి.. బకెట్ల కొద్దీ మురికి పారబోసి బెదిరింపులు
అసలు ఏం జరిగిందంటే?
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటన కలకలం రేపింది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకిన యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, హస్టల్ లో ఉంటూ ప్రైవేట్ గా పని చేస్తున్న ఓ యువతి(23) అనంతపురం జిల్లా ఉరవకొండకు వాసిగా గుర్తించారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
READ MORE: Hyderabad: భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో కీలక మలుపు..
ఆమె సెల్ ఫోన్ రిఫేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చి ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు ఉమెన్స్ కోచ్ లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళాలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. తర్వాత ఆ కోచ్ లో ఆమె ఒక్కతే ఒంటరిగా ఉండగా ఓ యువకుడు (25) బోగీలోని ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కావాలంటూ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని అత్యాచారయత్నానికి ట్రై చేశాడు. ఇక, అతడి నుంచి తప్పంచుకునే ప్రయత్నంలో ఆమె కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కోంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేశారు.