బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 2, ప్లాట్‌ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించినట్లు భోజ్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజ్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత, రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. మృతులందరూ ఉద్వంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారేనని చెబుతున్నారు.
READ MORE: Minister Komatireddy: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం..
“ఆ వ్యక్తి అతను మొదట అమ్మాయిని, తరువాత ఆమె తండ్రిని కాల్చాడు, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.’ అని ఎస్పీ వెల్లడించారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదని ఎస్పీ తెలిపారు. అయితే, ఇది ప్రేమ వ్యవహారం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన తండ్రి అనీల్ సింగ్, మైనర్ కూతురు జియా కుమారి అని ఎస్పీ వివరించారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారని ఎస్పీ తెలిపారు. ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వచ్చిందని తెలిసింది.
READ MORE: Off The Record : డైలమాలో బీఆర్ఎస్ నేతలు..సిల్వర్ జూబ్లీ బహిరంగ సభపై గందరగోళం