ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు.
SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్లో కూడా విజయం సాధించడంలో…
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది
ఈ నెల 19 నుండి పాకిస్తాన్-దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అనేక వివాదాలు, సన్నాహాల్లో జాప్యాల తరువాత పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడిన 'జీతో బాజీ ఖేల్ కే' తాజాగా విడుదల చేశారు.
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము…
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను…
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 4-1 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. అయితే ఈ సిరీస్‌లో సూర్య కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇది సూర్య కెరీర్లో చెత్త రికార్డు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్.. 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది.