నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి పాకిస్థాన్ 241 పరుగుల వద్ద కుప్పకూలింది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది.
READ MORE: Russia Ukraine War: యుద్ధానికి 3 ఏళ్లు.. 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..
కాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో విరాట్ ఫీల్డింగ్‌లో కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు పట్టిన భారత క్రీడాకారుడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 157 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ అజారుద్దీన్ (156), సచిన్ టెండూల్కర్ (140), రాహుల్ ద్రవిడ్ (124), సురేష్ రైనా (102)గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా.. అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు తీసుకున్నది మహేలా జయవర్ధనే (218), రికీ పాంటింగ్ (160).
READ MORE: Purandeswari: కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఊరట
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ గెలవాలంటే.. 242 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు. దీంతోమ్యాచ్‌లో పాకిస్థాన్ తిరిగి పుంజుకుంటుండగా.. అక్షర్ పటేల్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. హార్దిక్ పాండ్యా షకీల్‌ను పెవిలియన్‌కు పంపాడు. రవీంద్ర జడేజా వెంటనే తయ్యబ్ తాహిర్ (4) ను అవుట్ చేశాడు. సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రిది కూడా వెను వెంటనే ఔటయ్యారు. 200 పరుగుల వద్ద పాకిస్థాన్ 7వ వికెట్ కోల్పోయింది.. అనంతరం కుల్‌దీప్ యాదవ్ వేసిన 46.4 ఓవర్‌కు నసీమ్ షా (14) ఔటయ్యాడు. నసీమ్ షా.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు.