నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ గెలవాలంటే.. 242 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు. దీంతోమ్యాచ్‌లో పాకిస్థాన్ తిరిగి పుంజుకుంటుండగా.. అక్షర్ పటేల్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. హార్దిక్ పాండ్యా షకీల్‌ను పెవిలియన్‌కు పంపాడు. రవీంద్ర జడేజా వెంటనే తయ్యబ్ తాహిర్ (4) ను అవుట్ చేశాడు. సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రిది కూడా వెను వెంటనే ఔటయ్యారు. 200 పరుగుల వద్ద పాకిస్థాన్ 7వ వికెట్ కోల్పోయింది.. అనంతరం కుల్‌దీప్ యాదవ్ వేసిన 46.4 ఓవర్‌కు నసీమ్ షా (14) ఔటయ్యాడు. నసీమ్ షా.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్‌దిల్ షా (38) ఔటయ్యాడు.
READ MORE: Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
కాగా.. సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో 5 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.