2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌పై అతని ఇన్నింగ్స్ ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్.. నాయర్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత నాయర్‌కు ఎక్కువ అవకాశాలు లభించలేదు.
Costly Catch: దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. గడిచిన రెండు సీజన్లలో సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన టీం విజయం సాధించగా.. ప్రస్తుతం మూడో సీజన్ మొదలైంది. ఈ లీగల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రికెటర్లందరూ వారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే క్రికెట్ ఆడినందుకు ఆడవాళ్లకు అలాగే సిబ్బందికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు. కాకపోతే కొన్ని…
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్…
Kane Williamson: దక్షిణాఫ్రికా T20 లీగ్ (SA20)లో కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ప్రదర్శనతో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఈ లీగ్ లో తన ఆరంభ మ్యాచ్‌లోనే తన సత్తా చాటుతూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడిన తీరు జట్టు భారీ స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శుక్రవారం, జనవరి 10, 2025న జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్,…
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు…
నందలూరు మండల కేంద్రంలో కిక్రెట్ ఆడుతుండగా.. యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఇది చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా అనే కువకుడిపై దాడి చేశారు 11 మంది యువకులు.. అతడిని చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కావడంతో.. 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు..
ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను అమ్ముడుపోలేదు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే తాజాగా.. మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అగర్వాల్ చితక్కొడుతున్నాడు.
మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్'లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై…
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ నుంచి క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతి ఎంపికయ్యారు. ఈ క్రమంలో వారిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘనంగా సన్మానించింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఇరువురుని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.