SA20 2025: SA20 లీగ్ కొత్త ఛాంపియన్‌గా MI కేప్ టౌన్
- SA20 లీగ్ కొత్త ఛాంపియన్‌గా MI కేప్ టౌన్
- ఫైనల్‌లో MI కేప్ టౌన్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.
- MI కేప్ టౌన్ జట్టుకు 34 మిలియన్ ర్యాండ్లు (సుమారు 16.2 కోట్ల రూపాయలు) గ్రాండ్ ప్రైజ్ మనీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో మంచి ప్రదర్శన ఇచ్చింది. దీనితో MI కేప్ టౌన్ మొదటిసారి విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు మూడోసారి కప్ గెలవాలన్న కోరికకు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో నిరాశ ఎదురైంది. సన్ రైజర్స్ ను MI కేప్‌టౌన్ దెబ్బకొట్టింది. 182 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ కేవలం 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయం తర్వాత MI కేప్ టౌన్ జట్టుకు 34 మిలియన్ ర్యాండ్లు (సుమారు 16.2 కోట్ల రూపాయలు) గ్రాండ్ ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఫైనల్‌లో ఓడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు 16.25 మిలియన్ ర్యాండ్లు (సుమారు 7.75 కోట్ల రూపాయలు) దక్కాయి. అదేవిధంగా సీజన్లో మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు. మూడవ స్థానంలో ఉన్న జట్టుకు 4.24 కోట్ల రూపాయలు అందగా, నాల్గవ స్థానంలో ఉన్న జట్టుకు 3.74 కోట్ల రూపాయలు అందాయి.
Read Also: Mufasa: OTT లోకి వచ్చేస్తున్న ‘ముఫాసా:ది లయన్ కింగ్’ .
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
SA20 2025 లో MI కేప్ టౌన్ జట్టు విజయం, MI ఫ్రాంచైజీకి మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఎందుకంటే, MI ఫ్రాంచైజీ మొత్తం నాలుగు లీగ్లలో (ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, SA20) పాల్గొంటూ ప్రతి లీగ్లో కనీసం ఒకసారి ఛాంపియన్‌గా నిలిచింది. MI ఫ్రాంచైజీకి టీ20 లీగ్‌లో ఇది 11వ ఛాంపియన్‌షిప్. ఐపీఎల్‌లో 2013, 2015, 2017, 2019, 2020లో విజయం సాధించింది. అలాగే, ఛాంపియన్స్ లీగ్ 20లో 2011, 2013లో విజయం సాధించింది. 2023లో MI ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మెజర్ లీగ్ క్రికెట్‌లో విజయం సాధించింది. 2024లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 కూడా విజయం సాధించిన తరువాత, ఇప్పుడు SA20లో కూడా విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయంతో, MI ఫ్రాంచైజీ క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి మరింత దూకుడుగా ఎదుగుతోంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..